క్లబ్లో హంగామా.. సినీ నటిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు!
Thu Jun 12, 2025 15:06 Cinemas
సినీ నటి కల్పికా గణేష్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేక్ విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి, చివరికి పోలీసు కేసు వరకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... నటి కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌కు వెళ్లారు. రూ. 2200 బిల్ చేసి, కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరారట. అలా ఇవ్వడం కుదరదని మేనేజర్ చెప్పారు. ఈ విషయంలో కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పబ్‌లో గొడవకు సంబంధించి కల్పిక ఇటీవలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేక్ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్ ఎడిక్ట్ అంటూ దూషించారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 'ప్రయాణం', 'సారొచ్చారు', 'మా వింత గాధ వినుమా', 'యశోద' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కల్పిక గణేశ్‌కు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Hyderabad #kalpika Ganesh #PoliceCaseFile #Pub Incident #Tollywood #Heronie #Actor
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.